SKLM: కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన దుంప ఆదమ్మ, సీతాపురం గ్రామానికి చెందిన దుంప భారతిలకు స్థానిక రెవిన్యూ అధికారులు, నాయకులు చెరో రూ. లక్ష చెక్కులను గురువారం వారి స్వగృహాల వద్ద అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు చెక్కలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.