TPT: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో TTD మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి, టోకెన్ల కేటాయింపును FIFO (మొదటివచ్చినవారికి మొదటివ్వడం) పద్ధతిలో నిర్వహించాలనుకుంది. అయితే టోకెన్లు మూడు నెలల ముందుగా ఆన్లైన్లో విడుదల చేయబడతాయని, భక్తులు ఈ మార్పును గమనించి టోకెన్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని TTD విజ్ఞప్తి చేసింది.