MLG: చేపల పెంపకం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ దివాకర అన్నారు. వెంకటాపూర్ మండలం మారేడుగొండ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద చేప పిల్లలను విడుదల చేశారు. 2025-26కు గాను జిల్లాలోని 478 చెరువులు, 2 రిజర్వాయర్లలో కోటి 57 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.