VZM: డీసీసీబీలో డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీ ఇవ్వటం జరుగుతుందిని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గురువారం చీపురుపల్లి డీసీసీబీ కార్యాలయంలో డిపాజిట్ చేసిన వారికి ఆయన బాండ్ పేపర్లు ఇస్తూ అభినందించారు. డీసీసీబీ ఛైర్మన్గా నాలుగు నెలలు పదవీకాలంలో సుమారు 25 కోట్ల డిపాజిట్లను జిల్లా బ్యాంకు అధికారులు సేకరించారన్నారు.