AKP: నక్కపల్లి మండలం పెదబోదిగల్లం జెడ్పీ హైస్కూల్‌ను గురువారం ఎంఈవోలు కే.నరేష్, నాగన్నదొర తనిఖీ చేశారు. టెన్త్ పరీక్షలు దగ్గరపడుతున్నందున ప్రణాళికల అమలు, విద్యార్థుల సామర్థ్యం, తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లో విద్యాబోధన చేయవద్దని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు.