VZM: ఇటీవల తుఫాన్ దాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు భీమా చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ZP కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, గోనె సంచులను సప్లై చేయాలని అధికారులను కోరారు. అలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దు అన్నారు.