ADB: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం షేక్ పేట్లో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరారు.