WGL: వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి విక్రయాలను జిల్లా కలెక్టర్ సత్య శారదా గురువారం పరిశీలించారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న పత్తి లావాదేవీలను, క్రయవిక్రయాలను ప్రత్యక్షంగా చూసిన అనంతరం మార్కెట్ రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ రైతులతో నేరుగా పత్తి ధర, మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.