SS: పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ బస్సు సర్వీసులు ఈ నెల 15 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటాయని, రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు.