అనకాపల్లి: రాంబిల్లి మండలం పంచదార్లలో వేంచేసియున్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఫణిగిరి ప్రదక్షిణను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతం చుట్టూ సుమారు 27 కిలోమీటర్లు జరిగే ప్రదక్షిణలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తును నియమించారు.