NGKL: మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో వరద దాటికి జిల్లాలో మొక్కజొన్న పంట పూర్తిగా నీటిలో మునిగి పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీటిలో మొక్కజొన్న పంట తడిసి మొలకలు ఎత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.