MNCL: జన్నారం మండలంలోని శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. జన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న శివాలయం, సాయిబాబా దేవాలయం ఆవరణలోని శివాలయాల్లో ఉన్న శివలింగాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, మహిళలు శివాలయాలకు వెళ్లి అక్కడున్న శివలింగాలకు ప్రత్యేక పూజలు చేసి కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించారు.