KRNL: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియలో భాగంగా కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయన్నారు.