MBNR: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) 2024-26 బ్యాచ్‌కు చెందిన మొదటి సంవత్సర ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ రెండు దశల్లో నిర్వహించనున్నాయి. మొదటి దశ ఈనెల 10 నుంచి 14 వరకు, రెండో దశ ఈనెల 17 నుంచి 21 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా ఈనెల 4 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.