AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5వ తరగతి విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. భాష్యం పాఠశాలలో చదువుతున్న బాలిక.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. అయితే ఇది ఆత్మహత్య కాదు.. ఎవరో చంపి ఉరేశారని బాలిక తల్లి ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపించాలని కోరుతోంది. సీసీ కెమెరాలు పరిశీలించాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.