GDWL: పౌర్ణమి సందర్భంగా గద్వాల టౌన్, జమ్మిచెడిలో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి ఇవాళ ప్రత్యేకాలంకరణతో పాటు ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వెండి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం ప్రత్యేక దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ ఈవో పురందర్ కుమార్ తెలిపారు.