WGL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని తోపులాటలు లేకుండా భక్తులు క్యూలైన్లలో కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సాయం తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.