అల్లూరి: కార్తీక పౌర్ణమి సందర్భంగా హుకుంపేట మండలంలోని మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ దర్శించుకున్నారు. సర్పంచ్ మఠం శాంత కుమారి, ఆలయ కమిటీ సభ్యులు మత్స్య కొండబాబు, సింహాచలం, ఆనంద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పీవో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.