TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చు. ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అమల్లోకి వచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో 1994లో అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.