HYD: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సుదర్శన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని వారి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.