మణిపూర్ చురాచాంద్పూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. UKNAకి చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇటీవల జిల్లాలోని ఖన్పీ గ్రామ పెద్దను UKNA ఉగ్రవాదులు హత్య చేయడంతో పాటు గ్రామస్థులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఆపరేషన్ ఖన్పీ చేపట్టి వారిని హతం చేశాయి. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.