టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి తేదీ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో పెళ్లి వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.