RR: షాద్ నగర్ పట్టణం కమ్మదనంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. క్రీడాకారులలో ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ జోనల్ మీట్ 3రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.