KNR: స్నేహిత కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షణ, భద్రత, బాలబాలికల చట్టాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని, తద్వారా వారిలో ధైర్యం, భరోసా నింపాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్నేహిత రెండో దఫా అవగాహన కార్యక్రమాలపై కళాభారతిలో వివిధ శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.