NDL: ఈనెల 15న ఆళ్లగడ్డ పట్టణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కలిసి జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.