KMM: ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని తమ పరిధిలో రిపేరు కాదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో అగ్రహానికి గురయ్యాడు.