NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని గురువారం కళ్లకు నల్ల రిబ్బన్స్ కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.