వందేమాతరం గేయం రచించి రేపటితో 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రేపు ఉ.10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, CMల నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు ఇందులో పాల్గొనేలా చూడాలని సూచించింది.