HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ. 3.41 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. ఇందులో ఆధారాలు చూపించిన వారికి సీజ్ చేసిన డబ్బును తిరిగి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించి మద్యం తరలిస్తున్న రూ. 6.85 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.