MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ శివారులోని హార్న్బ్యాక్ ఈ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరిగాయి. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు, స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది.