కడప మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ వద్ద శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి SGF అండర్-17 ఖోఖో పోటీల్లో వల్లూరు మండలం గంగాయ పల్లె AP మోడల్ స్కూల్ & కళాశాల విద్యార్థిని G. మోక్షిత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ సురేష్ బాబు, PD సుశీలమ్మ, కళాశాల సిబ్బంది మోక్షితను అభినందించారు.