KDP: కొండాపురం పోలీస్ స్టేషన్ను జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజా, ఎస్సై ప్రతాప్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.