కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో ముద్దాయి నూరుల్లా(23)ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆర్థిక వివాదం నేపథ్యంలో ఫయాజ్ బాషాపై నూరుల్లా సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునేందుకు వచ్చిన చిన్న హుస్సేన్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.