KNR: వీణవంక మండలంలోని వల్బాపూర్, కనపర్తి గ్రామాల మధ్య గల వ్యవసాయ బావి వద్ద (మోటార్ ఆన్ ఆఫ్) బాక్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాపరు వైరు, స్టార్టర్‌ను దొంగిలించారు. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ. 10,000 ఉంటుందని బాధితుడు నాంపల్లి కుమారస్వామి తెలిపారు. ఇలాంటి సంఘటనలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.