JGL: నాలుగేళ్లుగా ఉపకార వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ కోరుట్ల పట్టణంలోని అన్ని ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, యాజమాన్యం కోరుట్ల ఆర్డీవో ఆఫీస్ ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతి పత్రాన్ని ఇచ్చారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.