TG: నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన EC.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని తెలిపారు. BJP, BRS లోపాయికారి ఒప్పందం వల్లే.. పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని ఆరోపించారు. ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు.