KDP: పాలగిరి గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి అర్చకులు ప్రసాద శర్మ విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా జల, పంచామృతాభిషేకాలు చేసి, తులసీమాలలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చి ఆరాధనలు చేశారు.