TG: ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈసీని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని.. కానీ వ్యతిరేకంగా బీజేపీ గెలిచిందన్నారు.