కెరీర్ ఆరంభంలో ఇబ్బందుల కారణంగా ఓ తరుణంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో ఎక్కువగా అవకాశాలు రాలేదని, నటించిన సినిమాలకు ఆదరణ లభించలేదని నాటి పరిస్థితులను గుర్తు చేసున్నాడు. ఓ సారి రైల్వే ట్రాక్ మీదకు కూడా వెళ్లబోయానని, కానీ లైఫ్ మెరుగుపడుతుందేమోననే ఆశతో వెనకడుగు వేసినట్లు పేర్కొన్నాడు.