CTR: చిత్తూరు రూరల్ మండలం వెంకటప్పనాయుడు చెరువు మొరవ నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి వెంకటప్ప నాయుడు చెరువు నిండి మొరవ నీరు ఉధృతిగా ప్రవహించడంతో.. మధ్యలో పంట పొలాలు మీదుగా ఏనుగుంటపల్లి గ్రామంలో నివాసాల వద్దకు చేరింది. దీంతో రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.