TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన మూడు రోజుల ప్రచారంపై మంత్రులు, పీసీసీ చీఫ్‌కు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ విడుదల చేస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజలు అయోమయంలో పడుతున్నారని, వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియపై నేతలు, కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.