HYD: పాతబస్తీలో మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా పనులు జరుగుతున్నాయన్న పిటిషనర్ వాదనను ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. నిర్మాణం వివరాలు, మెట్రో మ్యాప్‌ను సమర్పించాలని కోర్టు ఆదేశిచింది. తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.