ASF: ఫ్రీ ప్రైమరీ స్కూల్సు ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్ధితో పని చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ప్రీ ప్రైమరి టీచర్లకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 41 ప్రీ ప్రైమరి పాఠశాలలు ఉన్నాయని, వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామన్నారు.