AP: వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నందున మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ‘వందేమాతరం.. మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నిత్య చైతన్య గేయం. వందేమాతరం.. నినదిస్తాం నిరంతరం.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ట్రైబల్ బాయ్స్ స్కూల్లో భారత మ్యాప్, వందేమాతరం @ 150 రూపంలో 500 మంది విద్యార్థుల ప్రదర్శన ఇది.. అందరికీ అభినందనలు’ అని రాసుకొచ్చారు.