JN: జఫర్గడ్ మండలం కానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ గర్వాందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందేమాతర గేయం 150 ఏళ్ల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని సామూహిక వందేమాతర గేయాలాపన చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వందేమాతర గేయం పట్ల గౌరవం, దేశభక్తిని చాటుకున్నారు.