JGL: సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో జరిగిన ప్రతినిధి మండలి సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో 46మంది సీనియర్ సిటిజెన్లను సన్మానించారు.