GNTR: ఉపాధి హామీ పనులపై గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్ద చెరువులను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని, ప్రజల వినియోగానికి అనుకూలంగా వాకింగ్ ట్రాకులు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.