JGL: వెల్గటూర్ మండలం ZPHS చెగ్యాం పాఠశాల విద్యార్థిని అక్షయ రాష్ట్రస్థాయి అండర్-17 హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైంది. అక్టోబర్ 22న రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో జరిగిన కరీంనగర్ జోనల్ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 7 నుంచి 9 వరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననుంది.