GNTR: ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపడం లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇవాళయ నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించి, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.