BHPL: చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ‘వందేమాతరం’ జాతీయ గీతాలాపన చేశారు. సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని సీఐ అన్నారు. పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.